శివుడు

                                             శివుడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు హరుడని పిలవబడును
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు హరుడని పిలవబడును
నరుడి హృదయంబులో నిలువబడును

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు గంగనే  దింపగలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు గంగనే  దింపగలడు
పాపాన్ని గంగలో ముంచగలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గరళాన్ని ఆపగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గరళాన్ని ఆపగలడు
లోకాన్ని  సరళంగ  మార్చగలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు భస్మాన్ని దాల్చగలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు భస్మాన్ని దాల్చగలడు
నీ చితిని భస్మంతొ పూడ్చగలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు శక్తినే  పంచగలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు శక్తినే  పంచగలడు
కోరితే యుక్తిని పెంచగలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు విశ్వాన్ని ఏలగలడు 
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు విశ్వాన్ని ఏలగలడు 
“ విశ్వ”౦ లో ఒకడిగా నిలుపగలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు అణువులో  కలవగలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు అణువులో  కలవగలడు
నీ తనువు తనలోన  కలపగలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు రక్షతో ఉంచగలడు
నాలోన  గల శివుడు నీలోన గల శివుడు రక్షతో ఉంచగలడు
లేదంటే శిక్షతో తుంచగలడు

Leave a comment